Thursday, March 28, 2024

ఈనెల 6 వరకు నీట్ 2020 దరఖాస్తుల గడువు పొడగింపు

- Advertisement -
- Advertisement -

 

మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ యూజి 2020) దరఖాస్తు తేదీని పొడగిస్తూ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకే నీట్ కు గడువు ఉండగా.. ఇప్పుడు దాన్ని జనవరి 6వ తేదీ వరకు పొడిగించారు. వెబ్‌సైట్ ట్రాఫిక్ కారణంగా చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరో ఆరు రోజులు దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్టు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకునే వారికి ఈ నెల 15 నుంచి 31 వరకు గడువు ఉంటుందని తెలిపింది.

NEET 2020 Registration Last Date extended till Jan 6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News