Wednesday, May 1, 2024

ఆర్మీ చీఫ్‌గా జనరల్ ముకుంద్ నరావనె బాధ్యతల స్వీకారం

- Advertisement -
- Advertisement -

 

 

న్యూఢిల్లీ:  సైనిక దళాల ప్రధానాధికారిగా జనరల్ బిపిన్ రావత్ స్థానంలో జనరల్ మనోజ్ ముకుంద్ నరావనె మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ నరావనె ఈ పదవిని చేపట్టడానికి ముందు సైనిక దళాల ఉప ప్రధానాధికారిగా ఉన్నారు. తన 37 ఏళ్ల పదవీ కాలంలో జనరల్ నరావనె వివిధ హోదాలలో పనిచేశారు. జమ్మూ కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉధృతంగా ఉన్న కాలంలో ఆయన వీటిని అణచివేసేందుకు విశేషంగా కృషి చేశారు. జమ్మూ కశ్మీరులో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు కమాండర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ప్రస్తుత పదవిని చేపట్టడానికి ముందు ఆయన చైనాకు దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దులను పరిరక్షించే సైన్యానికి చెందిన తూర్పు కాండ్‌కు వైస్ చీఫ్‌గా ఉన్నారు.

 

New Army Chief General Mukund Naravane
New Army Chief Gen Mukund Naravane, Gen Naravane served in numerous command and staff appointments in peace, field and highly active counter insurgency environments
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News