Friday, April 26, 2024

పన్ను విధానం మనమే ఎంచుకోవాలి

- Advertisement -
- Advertisement -
Tax
బడ్జెట్‌లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్‌లు

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్‌లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్‌లు తీసుకొచ్చింది. సరళతర పన్ను విధానం కింద మినహాయింపులు, డిడక్షన్‌లలో మార్పులు చేసింది. కొత్త ఆదాయ పన్ను విధానం మనమే ఎంపిక చేసుకునేలా ఉంటుంది. మినహాయింపులు, డిడక్షన్‌లతో ఉండాలా? లేదా లేకుండా ఉండాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఒక్కసారి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే అదే తర్వాతి సంవత్సరాల్లో కొనసాగుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయం కల్గినవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, దీనికి పాత, కొత్త విధానంలోనూ మార్పు లేదని ఆర్థికమంత్రి చెప్పారు.

5 లక్షల వరకు పాత విధానమే..

పన్ను చెల్లింపుదారులకు పాత వ్యవస్థ లేదా కొత్త వ్యవస్థ నుండి ఎంచుకునే అవకాశం ఉంటుంది. రూ .2.5 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. రూ .2.5 లక్షల నుంచి రూ .5 లక్షల వరకు వచ్చే ఆదాయంపై 5 శాతం ఆదాయపు పన్ను వర్తిస్తుంది. అయితే 12,500 రూపాయల ఉపశమనం.

ఏడాదికి రూ .40 వేల కోట్ల నష్టం

ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ .40 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని సీతారామన్ అన్నారు. పాత పన్ను విధానంలో సుమారు 100 మినహాయింపులు, తగ్గింపులు ఉండగా, కొత్త విధానంలో 70 రకాల మినహాయింపులు తొలగించాలని ప్రతిపాదించారు. మిగతా ఉపశమనాలు, తగ్గింపులు తర్వాత సమీక్షిస్తారు. కొత్త విధానంలో రూ.15 లక్షలు ఆదాయంవారికి రూ.78,000 ఆదా అవుతుంది.

మినహాయింపులు, తగ్గింపులు లేవు

గమనించవలసిన విషయం ఏమిటంటే అన్ని పన్ను మినహాయింపులను కోల్పోవటానికి సిద్ధంగా ఉంటేనే ఈ కొత్త పన్ను శ్లాబ్ అందుబాటులో ఉంటుంది. ఈ మినహాయింపులో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సి, సెక్షన్ 80డి, ఎల్‌టిఎ, హెచ్‌ఆర్‌ఎ, గృహ రుణంపై వడ్డీ, ఇతర తగ్గింపులు ఉన్నాయి. మినహాయింపులు, తగ్గింపుల ప్రయోజనాలను కోల్పోకూడదనుకుంటే పాత పన్ను రేటును ఉపయోగించడం కొనసాగించవచ్చు. కొత్త విధానానికకి 80సి కింద ఎల్‌ఐసి, పిపిఎఫ్, ఎన్‌ఎస్‌సి, యులిప్, ట్యూషన్ ఫీజు, మ్యూచువల్ ఫండ్స్ ఇఎల్‌ఎస్‌ఎస్, పెన్షన్ ఫ్యాడ్, గృహ రుణం, బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్లు, పోస్టాఫీసులో 5 సంవత్సరాల డిపాజిట్, సుకన్య సమృద్ధి పథకాలకు పన్ను మినహాయింపును సద్వినియోగం చేసుకోలేం.

దీర్ఘకాలంలో మినహాయింపులన్నీ రద్దు

భవిష్యత్తులో ఆదాయపు పన్నులో అన్ని రకాల మినహాయింపులను రద్దు చేయవచ్చని బడ్జెట్ తర్వాత విలేకరుల సమావేశంలో సీతారామన్ అన్నారు. దీర్ఘకాలంలో ఆ దాయం పన్ను మినహాయింపులు అన్నింటిని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని తెలిపారు.

Tax

కొత్త, పాత ఉదాహరణలతో..

బడ్జెట్‌లో కొత్తగా తీసుకువచ్చిన 6 అంచెల శ్లాబ్‌లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80సి వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు శ్లాబ్‌ల విధానంలో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం 8,50,000 వరకు ఉండి 1,50,000ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు టాక్సబుల్ ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు. మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని

ఉదాహరణలతో తెలుసుకుందాం.

1.ఉద్యోగి ఆదాయం రూ.6,50,000, ఆదా రూ.1.5లక్షలు
పాత విధానంలో
6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా
చెల్లించాల్సిన టాక్స్ 0
కొత్త విధానంలో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 -5 లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 -6.5 లక్షల వరకు టాక్స్
1,50,00 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500
2. ఉద్యోగి ఆదాయం రూ.7లక్షలు, ఆదా 1.5లక్షలు
పాత విధానంలో..
7,00,000-1,50,000 =5,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0- 5.5లక్షల వరకు టాక్స్
50,00 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500
కొత్త విధానంలో..
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 -5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 -7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500
3. ఉద్యోగి ఆదాయం రూ.8,50,000, ఆదా రూ.1.5లక్షలు
పాత విధానంలో..
8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 -7.0 లక్షల వరకు టాక్స్
2,00,00 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
కొత్త విధానంలో ..
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 -5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 -7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్
1,00,00 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500

New Income Tax Slabs 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News