Sunday, April 28, 2024

రాష్ట్రంలో.. 24,700 స్మార్టు మీటర్లు

- Advertisement -
- Advertisement -

Smart meters

 

హైదరాబాద్ : విద్యుత్ శాఖ నష్టాలు తగ్గించడంలో స్మార్ట్ మీటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇటు వినియోగదారుడికి, అటు సంస్థలకు ఇవి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ వినియోగంలో విప్తవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరెంటు వాడకంలో ఆదా చేసే వెసులుబాటు, అవసరం మేరకే బిల్లును చెల్లించి కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఉండటంతో విద్యుత్ వినియోగంలో దుబారా, దుర్వినియోగం చాలా వరకు తగ్గుతుంది.

ఫలితంగా విద్యుత్ అవసరం మేరకే ఖర్చుచేయడం జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. తెలంగాణలో ఈపాటికే స్మార్ట్ మీటర్ల వినియోగం విరివిగా అమలు జరుగుతోంది. తెలంగాణలో మొత్తం స్మార్టు మీటర్లు సుమారు 24,700 మీటర్లు వినియోగంలో ఉన్నాయి. మరో 50 వేల మీటర్లు వినియోగించుకునేందుకు ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ కేటగిరీలుగా ఉండగా, అందులో అధికంగా సింగిల్ ఫేస్ మీటర్లను వినియోగిస్తున్నారు.

స్మార్టు మీటర్లతో ప్రయోజనాలు
వినియోగదారుడు తన ఇంటి అవసరం మేరకు మీటర్‌ను రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్మార్ట్ మీటర్లలో రీచార్జ్ నగదు నిలువ తగ్గుతున్న కొద్దీ వినియోగదారుల ఫోన్‌లకు సమాచారం చేరుతుంది. మీ మీటర్ రీచార్జ్ చేసుకోవాలని, లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అప్రమత్తత చేస్తూ ఉంటుంది. ఫలితంగా వినియోగదారుడు సమయానుకూలంగా విద్యుత్ మీటర్లను రీచార్జ్ చేసుకోవడం ఉంటుంది. దీంతో సంస్థకు బిల్లుల రూపేణా రావాల్సిన ఆదాయం క్రమంగా చేరుతుంది. బకాయిలు పెరిగే అవకాశాలు కనుమరుగవుతాయి.

బిల్లులు చెల్లించే గడువంటూ ఉండదు. విద్యుత్ విభాగం సిబ్బంది వచ్చి బిల్లులు చెల్లించలేదంటూ కరెంటును కట్ చేసే పరిస్థితులు ఉండవు. ఎక్కడ, ఎంత అవసరమో అక్కడే కరెంటును వాడే అలవాటుకు వినియోగదారుడు వస్తారు. ఫలితంగా దుబారా చేసే కరెంటుకు పుల్‌స్టాప్ పడుతుంది. బిల్లుల్లో వ్యత్యాసాలు, స్లాబ్ పద్దతంటూ ఏమీ ఉండదు. ప్రస్తుతం విద్యుత్ మీటర్లను విద్యుత్ విభాగం ఇస్తుండగా.. స్మార్ట్ మీటర్లు నేరుగా వినియోగదారుడే కొనుగోలు చేయాల్సి వస్తుంది.

సంస్థకు మేలు
విద్యుత్ బిల్లులు అందించడం, కరెంటు సరఫరా నిలిపివేసే సిబ్బంది తగ్గిపోతారు. ఫలితంగా ఆర్థిక భారం తగ్గుతుంది. సంస్థకు బకాయిలు లేకుండా కరెంటు వాడుకున్న మేరకు బిల్లులు ముందుగానే వసూలవుతాయి. కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వ్యయం తగ్గనున్నది. ఈపాటికే ఉన్న విద్యుత్ సరఫరా కేంద్రాల ఏర్పాటు భారాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన ధరను నిర్ణయిస్తుంది. పనిభారం, సమయానికి బిల్లుల వసూలు, సిబ్బంది తగ్గింపు, విద్యుత్ దుబారా తగ్గుదల వంటివి సంస్థకు మేలు చేయనున్నది. భవిష్యత్తులో స్మార్టు మీటర్ల విధానం అమలు చేయడంతో దుబారాగాబడే కరెంటు మిగిలి మరింత ఆదాయాన్ని చేకూర్చనున్నది.

Smart meters Reducing Power Department Losses
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News