Friday, September 13, 2024

ఉప్పల్‌లో పరుగుల వరద..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్‌కప్‌నకు సన్నాహకంగా శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన సాధన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 345 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకిల్ అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌ను ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 103 పరుగులు సాధించాడు. ఇక చెలరేగి ఆడిన షకిల్ 53 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 75 పరుగులు చేశాడు.

ఆఘా సల్మాన్ 33 (నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో పాక్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 43.4 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 72 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 97 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కేన్ విలియమ్సన్ (54), డారిల్ మిఛెల్ (59), మార్క్ చాప్‌మన్ 65 (నాటౌట్), జేమ్స్ నిషమ్ (33) చెలరేగి ఆడడంతో కివీస్ అలవోక విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News