Sunday, May 19, 2024

వచ్చే ఏడాది ఈద్‌కు ‘కభీ ఈద్ కభీ దివాళి’

- Advertisement -
- Advertisement -

salman khan

 

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ తాను నటించనున్న కొత్త సినిమా గురించి తెలియజేశాడు. 2021లో రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సాజిద్ నడియావాలా నిర్మించే ఈ చిత్రానికి కథా రచయిత ఫర్హాద్ సాంజీ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాంజీ దర్శకత్వంలో వచ్చిన ‘హౌస్ ఫుల్ 4’ ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 200కు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక గత ఏడాది సల్మాన్ చేసిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. భారత్, దబంగ్ 3 చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఓ మోస్తరు విజయాలను నమోదు చేసుకున్నాయి. ‘దబంగ్ 3’ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇక అదే దర్శకుడితో సల్మాన్ ‘రాధే’ అనే మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ ఏడాది ఈద్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

 

Next year Eid Kabhi Eid Kabhi Diwali
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News