Wednesday, October 9, 2024

రూ. 29.75 కోట్ల నీరవ్ మోడీ ఆస్తులు జప్తు

- Advertisement -
- Advertisement -

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన రూ. 29.75 కోట్ల మరికొన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం జరప్తు చేసుకుంది. బ్యాంకు డిపాజిట్లు, భూమి, భవనాల రూపంలో ఉన్న నీరవ్ మోడీ ఆస్తులను పిఎంఎల్‌ఎ కింద జప్తు చేసుకుంటూ ఇడి ప్రొవిజనల్ ఉత్తర్వును జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 2 బిలియన్ డాలర్లకు పైగా మోసం చేసిన కేసును ఐదేళ్లకు పైగా నుంచి దర్యాప్తు చేస్తున్న ఇడి గతంలో నీరవ్ మోడీకి చెందిన భారత్‌లోని రూ. 2,596 క్టో విలువైన ఆస్తులను జప్తు చేసుకుంది. 53 ఏళ్ల నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్‌లోని జైలులో ఉన్నాడు. భారత్‌కు అప్పగింతను వ్యతిరేకిస్తూ అతను దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును తప్పుడు పత్రాల ద్వారా మోసం చేసి రుణం పొందిన కేసులో నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ పాత్రపై ఇడి కేసు నమోదు చేసింది. నీరవ్ మోడీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా 2019లో పిఎంఎల్‌ఎ కోర్టు ప్రకటించింది. అదే ఏడాది అతడిని లండన్‌లో అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News