Sunday, May 4, 2025

తెలంగాణలో కులగణన జరగలేదు: కిషన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. జనాభ లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని వెల్లడించింది. అయితే కేంద్రం కులగణన చేపట్టడం కాంగ్రెస్ పార్టీ ఘనతే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేని మోడల్‌గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు.. కేవలం కుల సర్వే అని ఆయన అన్నారు. ఆ కులసర్వే కూడా తూతూ మంత్రంగా చేశారని ఎద్దేవా చేశారు. ముస్లింలను బిసిలలో కలపడం రాజ్యాంగా విరుద్ధమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో మొదటిసారి కులగణన జరగబోతోంది. సమగ్రమైన బిసి కులగణన చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కులగణనే జరగలేదు.. అలాంటప్పుడు రోల్‌మోడల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన జరిగితే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News