Monday, May 13, 2024

బిజెపిలో సిఎం అర్హత అభ్యర్థి ఎవరూ లేరు: కేజ్రీవాల్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అర్హత అభ్యర్థి ఎవరూ భారతీయ జనతా పార్టీలో లేరని, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార గడువు గురువారంతో ముగియనుండడంతో ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇంటర్వూ లో బిజెపిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సంబిత్ పాత్రనో లేక అనురాగ్ ఠాకూర్‌నో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటిస్తే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల పైనే బిజెపి దృష్టి కేంద్రీకరిస్తోందని, అది గెలుస్తుందో లేదో 11 వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలుతుందని పేర్కొన్నారు. మంచి చదువు, వైద్యచికిత్స,ఆధునిక రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఎవరైతే కోరుకుంటారో వారంతా ఆప్ ఓటర్లేనని ఆయన అన్నారు.

షహీన్‌బాగ్‌లో సిఎఎ వ్యతిరేక ఆందోళనలను ప్రస్తావిస్తూ ఎన్నికల కారణంగానే బిజెపి షహీన్‌బాగ్‌లో రోడ్డు నిర్మాణం తిరిగి పునరుద్ధరించలేదని ఆయన విమర్శించారు. రోడ్డు దిగ్బంధం చేయడంలో అమిత్‌షా ఆసక్తి ఏమిటి? ఆందోళనలపై చెత్త రాజకీయాలు సాగిస్తూ ఢిల్లీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. నగరం లోని అనధికార కాలనీల గురించి కమల నాధులు పూర్తిగా విస్మరించారని పూర్తిగా ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆప్ అధికారం లోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న ఉచిత పథకాలు కొనసాగించడమే కాకుండా మరిన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టడమౌతుందని హామీ ఇచ్చారు.

No one in BJP is worthy of becoming CM of Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News