Friday, May 3, 2024

ఎన్డీయే లేదు, ఇండియా లేదు.. సోలోగానే : మాయావతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కానీ తమ పార్టీ ఎలాంటి కూటమి లోను చేరదని, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) చీఫ్ మాయావతి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. “ ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడమనే ప్రసక్తే లేదు.

ఎన్డీయే కానీ, కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమిలోని పార్టీలు కానీ పేదప్రజలకు వ్యతిరేకం. కులతత్వం, మతతత్వం, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలతో ఉన్నవే. వీటికి వ్యతిరేకంగా బీఎస్‌పీ అనునిత్యం పోరాటం చేస్తోంది. ఆ కారణం గానే ఏ కూటమితోనూ కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదు. మీడియా సైతం ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరుకుంటున్నాను” అని మాయావతి అన్నారు.

బీఎస్‌పీ 2007లో చేసినట్టుగానే రాబోయే లోక్‌సభ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, సమాజంలో అణగారిన, నిర్లక్షానికి గురవుతున్న వర్గాలను ఏకీకృతం చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పారు. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని పటిష్టం చేయాల్సిందిగా కార్యకర్తలను కోరామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News