Friday, May 3, 2024

‘నూటొక్క జిల్లాల అంద‌గాడు’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

అవ‌సరాల శ్రీనివాస్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నూటొక్క జిల్లాల అంద‌గాడు’. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అవ‌సరాల శ్రీనివాస్ కు జోడీగా ‘చిలసౌ’ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అవ‌స‌రాల శ్రీనివాస్ తన బ‌ట్ట‌త‌ల‌ని క‌వ‌ర్ చేసుకోవ‌డానికి పడ్డ ఇబ్బందులను ఫన్నీగా చూపించిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు.శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది.

Nootokka Jillala Andagadu Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News