Sunday, June 16, 2024

ఢిల్లీ నార్త్ బ్లాక్‌కు బాంబు బెదరింపు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధానిలోని నార్త్ బ్లాక్‌కు బాంబు బెదరింపు వచ్చిందనిఢిల్లీ అగ్నిమాపక శాఖ (డిఎఫ్‌ఎస్) అధికారి ఒకరు తెలియజేశారు. నార్త్ బ్లాక్‌లోనే కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్నది. ఒక ఇమెయిల్ ద్వారా ఈ బెదరింపు వచ్చిందని అధికారి తెలిపారు. జాగిలాల బృందం, బాంబు నిర్వీర్య, పరిశోధక బృందాలు, పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బంది బాంబు కోసం అన్వేషణ సాగిస్తున్నారని డిఎఫ్‌ఎస్ అధికారి తెలియజేశారు. నార్త్ బ్లాక్‌లోని ఒక అధికారికి బాంబు బెదరింపు ఇమెయిల్ అందిన తరువాత డిఎఫ్‌ఎస్‌కు ఫోన్ చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అన్వేషణలు సాగుతున్నాయని, ఇంత వరకు అనుమానిత వస్తువు ఏదీ కనిపించలేదని అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News