Thursday, May 2, 2024

ఏప్రిల్ 16న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అదే రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతులలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 15వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. పరీక్ష ఫీజు కింద ఎస్‌సి,ఎస్‌టి, బిసి విద్యార్థులు రూ.125, మిగతా వారు రూ. 200 చెల్లించాలి. మరిన్ని వివరాలకు http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలి.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలు..

దరఖాస్తుల స్వీకరణ: జనవరి 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 8 నుంచి

ప్రవేశ పరీక్ష తేదీ : ఏప్రిల్ 16

ఫలితాల ప్రకటన : మే 15

విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు : మే 22

మోడల్ స్కూళ్లలో ఎంపికైన విద్యార్థుల జాబితా : మే 24

సర్టిఫికెట్ వెరిఫికేషన్, ప్రవేశాలు : మే 25 నుంచి 31 వరకు

తరగతులు ప్రారంభం : జూన్ 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News