Monday, April 29, 2024

తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పాత పెన్షన్…

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనపై ఉద్యోగ సంఘాల ప్రత్యేక ధన్యవాదాలు

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరణ కు కట్టుబడి ఉందని ప్రకటన చేయడంపై రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ,రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈడిగి నరేష్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల భావి జీవితానికి భరోసానిస్తూ వారికి సామాజిక భద్రతను కల్గించడం తమ బాధ్యతగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల తరుపున కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు ఆయన తెలియచేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ప్రకటించడం హర్షణీయం: ట్రెసా
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్దరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం యావత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News