Monday, May 5, 2025

మద్యం షాపు పర్మిట్‌ రూంలో గొడవ.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం షాపులోని పర్మిట్ రూంలో ఇకేద్దరి మధ్య గొడవ ఒక ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారంకి చెందిన ఆకుల ధనుష్ గౌడ్(20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియడంతో తన స్నేహితులు అభినవ్ గౌడ్(22), నాగిరెడ్డి(21)లతో కూకట్‌పల్లిలోని దారూవాలా వైన్ షాపుకి మద్యం తాగడానికి వెళ్లారు.

అప్పటికే మూసాపేటలో ఉంటూ బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న కావటి కేశవ్‌ (25) కూడా తన స్నేహితులతో పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతున్నారు. అయితే అక్కడకు వెళ్లిన ధనుష్ గౌడ్ స్నేహితులు, కేశవ్‌ని పక్కకు జరగాలని కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి కేశవ్.. ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ధనుష్ గౌడ్‌కి ఒక దెబ్బ కడుపులో బలంగా తగిలింది.

మరుసటి రోజు ఉదయం కడుపులో నొప్పిగా ఉండటంతో కెపిహెచ్‌బి కాలనీలోని రెమెడీ ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అక్కడి వైద్యులు పరిశీలించి.. అత్యవసర చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. నిమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా.. పెద్ద పేగు పగిలి ఇన్‌ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా.. చికిత్స పొందుతూ.. ధనుష్ గురువారం మృతి చెందాడు. ధనుష్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిసిటివి ఫుటేజీని పరిశీలించి.. కావటి కేశవ్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News