Tuesday, April 30, 2024

బిజెపి వస్తే ఆపరేషన్ రాజ్యాంగ

- Advertisement -
- Advertisement -

తమిళనాడు ప్రచార సభలో రాహుల్

చెన్నై : కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చివేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో శుక్రవారం జరిగిన పలు ఎన్నికల ప్రచార సభలలో రాహుల్ మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. రాజ్యాంగం , దేశ మౌలిక విలువల పట్ల మోడీ ప్రభుత్వానికి గౌరవం లేదని, తిరిగి పవర్ దక్కితే ముందుగా అంబేద్కర్ విరచిత రాజ్యాంగానికి ఎసరు పెడుతారని తెలిపారు.

మోడీ ప్రభుత్వానికి ఎంతసేపూ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధించడమే ఏకైక ఆలోచన అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బిజెపి పదేపదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. అత్యధిక మెజార్టీ దక్కితే తాము చేసేది ఇదేనని వారు చెప్పకనే చెపుతున్నారు. ఇంతకు ముందు ప్రపంచం భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చూసింది. ఇప్పుడు ఇక్కడి ప్రజాస్వామ్యం ఒక ప్రజాస్వామ్యామా అని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకుని తీరాలని మోడీ సంకల్పించారని విమర్శించారు.

ఇప్పటి ఎన్నికల నేపథ్యంలో ఇరు ప్రధాన పక్షాల నడుమ సైద్ధాంతిక పోరు ఉంది. ఓ వైపు ఆర్‌ఎస్‌ఎస్, పిఎం నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం అనబడే సంకుచిత శక్తి ఉంది. మరో వైపు ఇవి రామస్వామి వంటి సంస్కర్తలు ప్రబోధించిన ఆచరించిన సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత సంతరించుకున్న శక్తి ఉందని, ఈ రెండింటి మధ్య పోరులో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎంతో ఎక్కువ ఉందని రాహుల్ తెలిపారు. 30 లక్షల వరకూ ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వీటిని నిరుద్యోగ యువతికి కట్టబెట్టడం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలోని మోడీ సర్కారు నిరుద్యోగ యువతను నట్టేటా ముంచిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News