Thursday, May 2, 2024

నేడు ఇండియా తొలి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌డిఎకు పోటీగా ఏర్పాటు అయిన ప్రతిపక్ష కూటమి ఇండియా తొలి భేటీ గురువారం దేశ రాజధానిలో జరుగుతుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో ఈ సమావేశం జరుగుతుందని సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనుసరించాల్సిన సంయుక్త వ్యూహం ఖరారు చేసుకునేందుకు ప్రతిపక్షాలు సమావేశమవుతాయి. అధికార ఎన్‌డిఎను సభలలో ఏ విధంగా ఎదుర్కోవల్సి ఉంటుంది? ఉమ్మడిగా ఎటువంటి వ్యూహం అనుసరించాలనే విషయాలపై చర్చల జరుగుతుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ఆరంభమై, వచ్చే నెల 11వరకూ జరుగుతాయి. 26 ప్రతిపక్ష పార్టీలు మంగళవారం బెంగళూరులో జరిపిన సమావేశంలో ఇండియా ఏర్పాటు అయింది. పార్లమెంట్ సమావేశాలు విపక్ష కూటమి పనితీరుకు తొలి తార్కాణం కానుంది. లోక్‌సభలో 26 పార్టీల ఇండియాకు 150 మంది ఎంపిల బలం ఉంది. కాగా ఎన్‌డిఎకు 330 మంది ఉన్నారు. ఢిల్లీ, 10 రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు సొంతంగా కానీ కూటమిగా కానీ అధికారంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News