Monday, April 29, 2024

రాహుల్ బృందానిది తప్పుడు సమాచార తుపాను

- Advertisement -
- Advertisement -

CAA

 

గాంధీనగర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజల్లోకి వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. తప్పుడు సమాచార తుపాను వెనుక రాహుల్ బాబా అండ్ కంపెనీ ఉందని దుయ్యబట్టారు. గాంధీనగర్‌లో శనివారం జరిగిన గుజరాత్ పోలీసుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాహుల్ బాబా అండ్ కంపెనీకి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వామపక్షాలు తోడయ్యాయని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వాన్ని లాక్కోవడానికి ఉద్దేశించినదా? లేదంటే పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఉద్దేశించినదా? అనే అంశాలపై చర్చకు రావాలని అమిత్ షా సవాల్ విసిరారు. కోట్లాదిమందికి పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు.

Opposition is a false campaign on CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News