Monday, April 29, 2024

నువ్వు కొరకనంటే సరే…

- Advertisement -
- Advertisement -

Pope Francis

 

ఇటీవల తన చేయి పట్టుకుని వెనక్కు లాగినందుకు ఓ మహిళలను కొట్టి వార్తల్లో నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. ఈ సారి అలాంటిదేం కాదు.. ప్రేమ, ఆప్యాయతలతో దగ్గరయ్యారు లెండి. వేలాది జనం గుమిగూడి ఉన్న హాల్ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్నారు. కేకలతో ఆ హాల్ హాలంతా సందడిగా ఉంది. అంతమంది అరుపుల మధ్యలో ఓ నన్ గట్టిగా తన గొంతును వినిపించింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్’ అంటూ పెద్దపెట్టున అరిచింది. అది విన్న పోప్ తనను కొరకనంటేనే ముద్దిస్తానన్నారు.

ఆయన వ్యాఖ్యలతో కొత్త సంవత్సరంనాడు జరిగినదానికి గుర్తు చేసుకున్న ఆ హాల్‌లోని జనాలంతా ఘొల్లున నవ్వారు. ‘ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్ ఆమె కుడి చెంపపై సుతారంగా ముద్దు పెట్టారు. దీంతో ఎనలేని ఆనందంతో ఆ మహిళ పోప్‌కు కృతజ్ఞతలు చెబుతూ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Pope Francis kisses nun
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News