Thursday, May 2, 2024

విపక్షాలది కేవలం స్కామ్‌లు, అవినీతి వ్యవహారమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఇంతకుముందు ఏళ్ల తరబడి అధికారంలో ఉంటూ వచ్చిన పార్టీలు 21వ శతాబ్ధంలో ఇండియా ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మౌలిక వ్యవస్థను అధునాతనం చేసుకోవడం ద్వారానే ఇండియా మరింత వేగంగా ముందుకు దూసుకువెళ్లుతుందన్నారు. దీనిని అంతా గుర్తించాల్సి ఉంటుంది. దీనిలో రాజకీయాలు జొప్పించరాదన్నారు. ప్రతిపక్షాలు పదేపదే అదేపనిగా అవినీతితో స్కామ్ దుమారాలను సృష్టిస్తాయని, ఈ విధంగా వీటికి భారీగా మురికి అంటుకుందని కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశం కన్నా వీరికి కేవలం రాజకీయాలు , ప్రత్యేకించి వంశం కుటుంబ పాలనపైనే మక్కువ ఎక్కువ అన్నారు. వారు తెలిపిన హై స్పీడ్ రైళ్లు ఏ స్టేషన్‌లో ఆగాయని ప్రశ్నించారు.

ఇప్పుడు దేశంలో మూడు ఎన్‌ల సర్కారు ఉందని, నియ్యత్ ( సదుద్దేశం), నీతి( పద్ధతి), నిష్టా( అంకితభావం) సంతరించుకున్న ప్రభుత్వం మీ ముందున్నారు. వీటివల్లనే ప్రగతి పట్టాలు తప్పకుండా అనుకున్న మజిలీ చేరుకుంటుదన్నారు. ఇటీవల ముగిసిన తన మూడు దేశాల పర్యటన గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పలు సవాళ్లను భారతదేశం ఎదుర్కొన్న తీరు, కోవిడ్ కష్టకాలంలో ఇతర దేశాలకు తోడ్పాటు అందించిన వైనం ఇటువంటివి అన్నీ కూడా భారతదేశం పట్ల ప్రపంచ ప్రజలలో నమ్మకం ఇనుమడింపచేశాయన్నారు. ఇది తన విదేశీ పర్యటనలో తెలిసిన వాస్తవం అన్నారు. చాలా మంది భారత్‌కు వచ్చి ఇక్కడి ప్రగతిని అర్థం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని, అక్కడి భారతీయ సంతతివారితో తన ఇష్టాగోష్టి అంశాలను తెలిపారు. ఇది సుందరరమణీయమైన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సదవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు. ఈ దశాబ్ధి ఉత్తరాఖండ్‌దని తాను 2022లో కేదార్‌నాథ్ పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఈ విషయాన్ని రుజువు చేసే దిశలోనే ఇప్పుడు రైలు, రోడ్డు, రోప్‌వే వ్యవస్థల ఏర్పాట్లు స్పీడందుకున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News