Saturday, April 27, 2024

‘దసరా’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓరి వారి’ విడుదల..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ’దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ‘ఓరి వారి’ పాటని విడుదల చేశారు.

మేకర్స్ ముందుగా చెప్పినట్లు ‘ఓరి వారి’ హార్ట్‌బ్రేక్ సాంగ్. సంతోష్ నారాయణ్ ఈ పాటని హార్ట్ టచ్చింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. మళ్ళీమళ్ళీ వినాలనిపించే పాట ఇది. శ్రీమణి అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రతి పదం మనసుని తాకుతుంది. ఓరి వారి పాట వాలెంటైన్స్‌డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా ఆడియన్స్‌ని అలరించింది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ నాని మాట్లాడుతూ..“దసరా’ లో నాకు చాలా ఇష్టమైన పాట ఓరి వారి. నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గర వున్న పాట ఇది.

ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డల పడుకోవాలి.(నవ్వుతూ). అదే ఈ పాట లిరిక్స్. శ్రీమణి చాలా అద్భుతంగా రాశారు. సంతోష్ నారాయణ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. విజువల్‌గా ఈ పాట నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్. మార్చి 30న స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతారు. వినే కొద్ది నచ్చే పాట ఇది. దసరాకి చాలా సెలబ్రేషన్స్ ఈవెంట్స్ వుంటాయి. ‘దసరా’ అందరం సెలబ్రేట్ చేసుకునే సినిమా”అని అన్నారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ..“దసరా’ నేచురల్‌గా వుండే కథ. మా ఊరిలోని కొన్ని పాత్రల నుంచి తీసుకొని రాసుకున్న డ్రామా. నాని చాలా హార్డ్ వర్క్ చేశారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News