Friday, May 3, 2024

కోర్టుకు వెళ్లి తప్పు చేశాం..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ఒకరిద్దరీ కోసం కోర్టుకు వెళ్లి సూర్యాపేట మెయిన్ రోడ్ ఆధునికత పనులను అడ్డుకుని తపుచేశామని, 60ఏళ్ల లో ఏనాడూ జరుగని అభివృద్ది సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి చేశారని తో మెయిన్ రోడ్ వ్యాపారులు అన్నారు. రహదారి విస్తరణ ను అడ్డుకోవడానికి స్వార్దం తో కొందరు చేసిన వ్యవహారం అందరీ వ్యాపారుల పాలిట శాపంగా మారిందన్నారు. త్వరలోనే కోర్టు వివాదం సమసిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే రహదారిని నిర్మిస్తామన్నారు.

పోరాట పటిమ గల సూర్యాపేట పౌరులు రహదారి విస్తరణ లో స్వార్ధపరుల మాట విని నష్టపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. ఏది ఏమైనా వ్యాపారుల అవగాహన రాహిత్యం కారణంగానే రోడ్ నిర్మాణం ఆలస్యం అయిందని అన్నారు. ఇప్పటికి అయినా రోడ్ నిర్మాణం కోసం మెజార్టీ వ్యాపారులు కోర్టు కేసును ఉపసంహరించుకోడం శుభ పరిణామం అని మంత్రి అన్నారు. అభివృద్ది నిరోధకుల పట్ల అప్రమత్తంగా ఉండి సూర్యాపేట లో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞం లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News