Friday, September 20, 2024

జీతం రాక, అప్పులు చెల్లించలేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీమ్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట్ జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీమ్ మూడు నెలలుగా జీతం అందక, రూ. 1790 అప్పు కట్టలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి తీరని బాధలు కలిగించానని అతడు తన ఆత్మహత్య లేఖలో రాశాడు. రూ. 1790 అప్పులను ఎలాగోలా చెల్లించమని అతడు తన భార్యకు రాశాడు. మరెవరికీ తనలాంటి పరిస్థితి రాకూడదని ఆత్మహత్య నోట్ లో రాశాడు. అంతేకాక తన మిత్రులను ఉద్దేశించి కూడా రాశాడు.

దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి. రామారావు స్పందిస్తూ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి రోజునే జీతం పడేలా చూస్తామన్న ప్రభుత్వం తీరు ఇదేనా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి వసీమ్ ఆత్మహత్యే సాక్ష్యం అన్నారు. ‘‘అతడి చావుకు ఎవరు కారణం?’’ అని ప్రశ్నించారు. ఆయన ఈ మేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News