Thursday, May 2, 2024

ప్రేక్షకులు నా నమ్మకాన్ని నిజం చేశారు: విశ్వక్‌సేన్

- Advertisement -
- Advertisement -

Pagal movie Success meet

 

విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగల్’. ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “నేను హీరోగా చేసిన హిట్ సినిమా ‘హిట్’ కలెక్షన్స్ కంటే ‘పాగల్’ కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి.

నేను నమ్మింది ప్రేక్షకులను.. వారు నా నమ్మకాన్ని నిజం చేశారు. సినిమా విషయంలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. కానీ ఈ సినిమా విజయం వారికి సమాధానం చెప్పింది”అని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ “విశ్వక్ ఈ సినిమా విషయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే దిల్ రాజు, శిరీష్ నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నివేదా పేతురేజ్, మేఘా లేఖ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News