Friday, May 3, 2024

నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించిన పాక్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అవినీతి కేసుల్లో దోషిగా తేలిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇప్పుడు నిర్దోషిగా పాకిస్థాన్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఆయన రెండు అవినీతి కేసుల్లో 2018లో దోషిగా తేలారు. అయితే నిర్దోషిగా బయటపడడంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఆయనకు ఊరట లభించినట్టయింది. ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో ఆయనను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా, మరో అవినీతి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఎవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో 2018లో తనకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ షరీఫ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫరూక్ నేతృత్వం లోని ధర్మాసనం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో 2018 డిసెంబర్‌లో ఆయనకు ఏడేళ్లు జైలు శిక్ష పడింది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్‌ఎబి), ఈ కేసులను దాఖలు చేసింది. దీనిపై షరీఫ్ అపీలుకు వెళ్లారు. 2019లో లండన్ వెళ్లిన షరీఫ్ తిరిగి రాలేదు. గత నెల ఆయన తిరిగి వచ్చాక ఈ కేసుల్లో అపీళ్లు పునరుద్ధరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News