Friday, May 3, 2024

రాహుల్ సారీ చెబితేనే మాట్లాడనిస్తాం: బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెపితేనే ఆయనను లోక్‌సభలో మాట్లాడనిచ్చేది లేదని బిజెపి వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. వేరే దేశానికి వెళ్లి ఇక్కడ ప్రజాస్వామ్యం బాగాలేదని చెప్పడానికి రాహుల్‌కు ఎంత ధైర్యం? ఆయన తన తప్పిదాన్ని చక్కదిద్దుకుంటేనే మాట్లాడేందుకు వీలేర్పడుతుందని బిజెపి తెలిపింది. పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండోరోజు కూడా గందరగోళం నడుమ శుక్రవారం వాయిదా పడ్డాయి.

కేంబ్రిడ్జి వర్శిటీలో వ్యాఖ్యలకు రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాల్సి ఉందని బిజెపి ఓ వైపు, అదానీ హిండెన్‌బర్గ్ నివేదికపై జెపిసి దర్యాప్తునకు విపక్షాలు పట్టుపట్టడంతో , అరుపులు కేకలు సభలో గందరగోళం నడుమ ఉభయసభలు వాయిదా పడ్డాయి. రాహుల్ క్షమాపణలు తెలియచేయకపోతే ఇకపై కూడా అంటే వచ్చే వారం కూడా ఇదే విధంగా తమ పట్టు ఉంటుందని బిజెపి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News