Home తాజా వార్తలు రోజ రోజ క్రేజీ రోజ..

రోజ రోజ క్రేజీ రోజ..

Pataas Pilla Song released from 'DJ Tillu'

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలసి నిర్మిస్తు న్న ఈ చిత్రంలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగ తి, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వినోద ప్రధానంగా సాగే కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాజ రాజ ఐటం రాజ… రోజ రోజ క్రేజీ రోజ… పటాస్ పిల్ల పటాస్ పిల్ల’ పాట విడుదలైంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సా హిత్యాన్ని అందించారు. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన అనిరుద్ రవిచందర్ గాత్రాన్ని అందించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిల పై చిత్రీకరించిన ఈ గీతానికి విజయ్ బిన్ని నృత్యాలను సమకూర్చారు. సాహిత్యం, స్వరం పోటీ పడిన ఈ పాటకు సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది.

Pataas Pilla Song released from ‘DJ Tillu’