Friday, March 29, 2024

20 నుంచి ‘పింక్’ రీమేక్‌లో

- Advertisement -
- Advertisement -

Pawan kalyan

 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పవన్‌కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తుండడంతో అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నెల 20 నుండి ఈ స్టార్ హీరో షూటింగ్‌లో పాల్గొననున్నారట. పవన్‌పై ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌ని షూట్ చేయనున్నారని తెలిసింది. అందుకోసం చిత్ర యూనిట్ భారీ సన్నాహాలు చేస్తోంది. ఇక భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి పవన్‌ని ఈ సినిమాలో నటింపచేస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ సినిమాకి పవన్‌కల్యాణ్ డేట్స్ ఇచ్చినట్లు తెలిసింది.

ఆ సమయంలోపునే పవన్ షూటింగ్ పూర్తి చేయనున్నారట. తమపై జరిగిన అరాచకాన్ని ఎదిరించి పోరాడుతున్న ముగ్గురు అమ్మాయిలకు అండగా నిలబడే ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో ఈ స్టార్ హీరో నటిస్తున్నారు ఈ సినిమాలో. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఇది. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ విషయమై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది. త్వరలోనే ఆ విషయంపైనా క్లారిటీ రానుంది. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Pawan kalyan In Pink movie remake
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News