Friday, April 19, 2024

పవన్, క్రిష్ ల మూవీకి టైటిల్ ఫిక్స్.. ఫ‌స్ట్ గ్లింప్స్ అదిరింది

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డైరెక్టర్ క్రిష్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ తన 27వ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ టైటిల్ తోపాటు పవన్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ గ్లింఫ్స్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో పవన్ ఎంట్రీ అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ఇక, ఈ మూవీకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పిరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ వ‌జ్రాల దొంగగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగ‌ర్వాల్‌, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ 2022 జనవరిలో తెలుగుతోపాటు తమిళ్, మళయాలం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

Pawan’s ‘Hari Hara Veera Mallu’ first glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News