పెద్దాపురం: ప్రియురాలితో పాటు ఇద్దరు పిల్లలను చంపేసి అనంతరం ఆ హత్యలను దొంగలు చేసినట్టు చిత్రీకరించి దొరికిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సామర్లకోట సీతారామకాలనీలో తలే సురేష్ అనే వ్యక్తి తన లారీని నడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన మాధురితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ప్రియురాలు కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయం సురేష్ భార్యకు తెలియడంతో గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మాధురి తన భర్త నుంచి విముక్తి కలిపి నుంచి వేరే కాపురం పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నెల 2న మాధురి పిలవడంతో కర్ర తీసుకొని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.
బంగారం, వాషింగ్ మెషిన్ కొనివ్వాలని డిమాండ్ చేయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే కర్ర తీసుకొని ఆమె తలపై పలుమార్లు బాదాడు. ఆమె కేకలు వేయడంతో ఇద్దరు పిల్లలు లేచారు. పిల్లలు తనని గుర్తు పట్టే అవకాశం ఉందని, వారిని కర్రతో తలపై బాది గొంతు నులిమి చంపేశాడు. అనంతరం రెండు ఫోన్లు, బంగారు ఆభరణాలు తీసుకొని లారీలో యానాం వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాధురి కాల్ హిస్టరీని పరిశీలించగా సురేష్తో గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే న్యాయ సలహా కోసం లాయర్ వద్దకు వస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. తానే హత్యలు చేశానని ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.