Thursday, May 2, 2024

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

- Advertisement -
- Advertisement -
  • తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి

పెద్దేముల్: పల్లెల అభివృద్ధే ప్రధాన లక్షమని.. దశల వారీగా గ్రామాలన్నింటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని హన్మాపూర్, తట్టేపల్లి, ఓమ్లనాయక్ తండా, జయరాం తండా(ఓ) గ్రామాల్లో పర్యటించారు.

ఈ మేరకు నూతన పంచాయితీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నటి వంటి గాంధీజీ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మిస్తూ.. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. పాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పల్లెప్రగతి దినోత్సవంలో భాగంగా ఆయా గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులను సన్మానించి జ్ఙాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి అనురాధ, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి లలితాకుమారి, ఎంపిడిఒ లక్ష్మప్ప, సర్పంచులు సుమలత, రాథోడ్ చావ్లీ భాయి, ఎంపిటిసి లొంక నీలు నర్సింహులు, ఎంపిటిసిల ఫోరం ఉపాధ్యక్షుడు వెంకటేశ్ చారి, సర్పంచ్, ఎంపిటిసి సంఘాల అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, ధన్‌సింగ్, రైతు కమిటీ అధ్యక్షుడు జైరాం నాయక్, బిఆర్‌ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సీనియర్ నాయకులు రమేశ్, నారాయణ రెడ్డి, రవినాయక్, లక్ష్మణ్, శ్రావణ్, పాండు, భరత్ కుమార్, ప్రభు, పంచాయితీ కార్యదర్శులు కృష్ణ, రజిత, గోపాల్, చైతన్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News