Saturday, March 2, 2024

పాలమూరు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్

- Advertisement -
- Advertisement -

Petition against Palamuru Ethipothala project in NGT

మనతెలంగాణ/హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట(బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషన్ దారుడు కోస్గి వెంకటయ్య ఎన్‌జిటి దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడంలేదని ముదిరెడ్డిపల్లి వాసి కోస్గి వెంకటయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును అడ్మిట్ చేసుకున్న ఎన్‌జిటి కేంద్ర పర్యావరణశాఖ, రాష్ట్ర సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్‌ఇ, గనులశాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగాయేలేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ ఉల్లంఘనలపై వాస్తవ పరిస్థితిని తనిఖీ చేసి ఆగస్టు 27వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌జిటి ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.

Petition against Palamuru Ethipothala project in NGT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News