Thursday, September 19, 2024

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సుప్రీం కోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను నమోదు చేయడానికి సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ నిరాకరించినట్టు పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషన్ దరఖాస్తులను నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా షార్ట్ సెల్లర్ హిండిన్‌బర్గ్ రీసెర్చి చేసిన మోసం ఆరోపణలను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలపై సెబీ నుంచి స్టేటస్ రిపోర్ట్ కోరిన దరఖాస్తును జాబితా చేయడానికి కోర్టు రిజిస్ట్రీ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది అప్పీలు చేశారు.

న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన అప్పీల్‌లో జనవరి 3న నాటి ఆదేశాలలో సుప్రీం కోర్టు తన విచారణను పూర్తి చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) కి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై జోక్యం చేసుకోవడానికి లేదా తదుపరి చర్యలకు ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై వార్తాపత్రికల నివేదికల ద్వారా వెళ్లలేమని లేదా నిపుణుల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోలేమని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ విషయంలో ఏదైనా తదుపరి చర్య అవసరమా లేదా అని సెబీకి వదిలేసింది. ఈ విచారణను ఈ కాలక్రమంలో ‘ప్రాధాన్యంగా’ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించాలని తివారీ కోరారు.

జూన్ 3న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సెబీ దర్యాప్తు నివేదికను సమర్పించింది. భారతీయ సెక్యూరిటీల మార్కెట్ పటిష్టతను మెరుగుపరిచేందుకు కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనలను పరిగణన లోకి తీసుకున్నారా లేదా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వంతోపాటు సెబీ కూడా స్టేటస్ రిపోర్టును సమర్పించింది. లోక్‌సభ 2024 ఫలితాల తరువాత షేర్ మార్కెట్ పతనం, పెట్టుబడిదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వం సెబీ వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని తివారీ కోరారు.

అయితే ఆగస్టు 5న, కోర్టు రిజిస్ట్రార్ దరఖాస్తును “పూర్తిగా తప్పుగా భావించారు” అని, ఎటువంటి సహేతుకమైన కారణాన్ని వెల్లడించలేదని పేర్కొంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. తివారీ వైఖరికి విరుద్ధంగా సెబీ దర్యాప్తునకు కోర్టు ఎలాంటి గడువు విధించలేదని రిజిస్ట్రార్ వాదించారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా 2023 హిండెన్‌బర్గ్ నివేదిక ప్రచురించిన తరువాత నష్టాలను చవిచూసిన ప్రజలకు, పెట్టుబడి దారులకు సెబీ దర్యాప్తు ముగింపు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని తివారీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News