Thursday, May 2, 2024

పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది. క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున యుఎపిఎ కింద విచారణ అనంతరం ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనుబంధ సంస్థలైన సిఎఫ్ఐ, ఆర్ఎఫ్ఐ, ఎఐఐసి, ఎన్ సిహెచ్ఆర్ఒ, ఎన్ఎఫ్ డబ్ల్యూలను కూడా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడడం.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించడంతోపాటు ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్న పిఎఫ్ఐని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలు బ్యాన్ చేయాలని సిఫారసు చేసింది. తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

PFI banned for five years over terror links

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News