- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో 8వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు మంగళవారం మరోసారి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు స్పందించిన సంజయ్ 8వ తేదీన విచారణకు హాజరౌతానన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మొట్టమెదట గళం విప్పిన వ్యక్తి బండి సంజయ్ కావడంతో ఈ కేసులో ఆయన స్టేట్‌మెంట్ నమోదు ఆసక్తికరంగా మారనుంది. కేంద్ర నిఘా సంస్థల సహకారంతో పలు ఆధారాలు బండి సంజయ్ సేకరించాని, ఈ ఆధారాలు సిట్ అధికారులకు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటుగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైకోర్టుటో పిటిషన్ దాఖలు చేసింది.
- Advertisement -