Monday, May 13, 2024

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, శాని, వీణారెడ్డి ముఖ్య తారాగణంగా ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్లాన్-బి‘. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ “ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠతో సరికొత్త కథ, కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ ఇది. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, మురళి శర్మ, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్ నటన చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది”అని తెలిపారు. నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ..“ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మా చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది” అని చెప్పారు.

Plan B movie to released on Sep 17th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News