Monday, May 6, 2024

Rahul: శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ త్వరలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారిస్థూ సూరత్‌లోని ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రాహుల్‌గాంధీని సవాల్ చేయనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పిటిషన్ సిద్ధమైందని న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశం ఉందని బుధవారం ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో సూరత్ సెషన్స్ కోర్టులో దాఖలు చేయనున్న రివ్యూ పిటిషన్‌పై పార్టీకి చెందిన అగ్ర న్యాయసలహాదారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. మోడీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై 2019లో నమోదైన పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడింది.

ఈనేపథ్యంలో రాహుల్ లోక్‌సభ ఎంపిగా అనర్హతకు గురయ్యారు. ఈ అంశంపై రాజకీయంగా, న్యాయపరంగా తెలిపింది. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బడ్జెట్ సెషన్‌లో రాహుల్‌గాంధీ హాజరుకానివ్వకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనర్హత వేటు వేసిందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ అన్నారు. రాహుల్‌ను పార్లమెంటుకు దూరంగా
ఉంచేందుకే అనర్హత వేటు వేశారని పార్లమెంటు వెలుపల విలేఖరుల సమావేశంలో ఠాగూర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News