Tuesday, April 30, 2024

‘కా’ ఆందోళనలపై ప్రధాని వ్యాఖ్యల్లో వాస్తవం లేదు

- Advertisement -
- Advertisement -
Pinarayi-Vijayan
ఘాటుగా స్పందించిన కేరళ సిఎం పినరయ్

తిరువనంతపురం : కేరళలో ‘కా’ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో తీవ్రవాదులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ‘అది వాస్తవం కాదు, ఖండించదగ్గది’ అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో సోమవారం మోడీ ఒక ప్రకటన చేశారు. కొత్త పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, తప్పుడు సమాచారం అందిస్తున్నాయని విరుచుకుపడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కా వ్యతిరేక ఆందోళనల్లో తీవ్రవాద శక్తులు చొరబడుతున్నాయని ఒకవైపు చెబుతూ, మరోవైపు ఢిల్లీల్లో వారిని ప్రోత్సహిస్తున్నారని మోడీ ఆరోపించారు. మోడీ వ్యాఖ్యలకు కేరళ ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ‘కేరళకు సంబంధించి రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రకటన నిజం కాదు, ఖండించాలి’ అని విజయన్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. ‘మతవాదులు తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే సంఘటిత ఉద్యమాన్ని విరమించుకునేందుకు కేరళ సిద్ధంగా లేదు. ప్రజల ఉద్యమంలోకి ఎవరు చొరబడాలని ప్రయత్నించినా అడ్డుకుంటాం’ అని పినరయి విజయన్ స్పష్టం చేశారు.

PM maligning anti CAA protests in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News