Sunday, June 23, 2024

దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ

- Advertisement -
- Advertisement -

దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నార్త్, సౌత్, ఈస్ట్ లను కలుపుతూ మూడు కొత్త రైలు కారిడార్లను నిర్మిస్తామని.. త్వరలోనే కారిడార్ల సర్వే పనులు ప్రారంభమవుతాయని మోడీ తెలిపారు.

వందేభారత్ రైళ్లను దేశంలోని ప్రతి మూలకు బిజెపి విస్తరిస్తుందని మోడీ చెప్పారు. దేశంలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ చైర్‌కార్, వందే భారత్ మెట్రో అనే 3 రకాల వందే భారత్ మోడల్‌లు నడుస్తాయని తెలిపారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. దాదాపు పూర్తి కావస్తున్నాయన్నారు. అదే విధంగా త్వరలో ఉత్తర భారతదేశంలో ఒక బుల్లెట్ రైలు, దక్షిణ భారతదేశంలో ఒక బుల్లెట్ రైలు, తూర్పు భారతదేశంలో ఒక బుల్లెట్ రైలు నడుస్తుందని.. దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News