Sunday, September 21, 2025

జిఎస్టితో ‘వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్’ కల సాకారం: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సోమవారం నుంచి కొత్త జిఎస్‌టి శ్లాబ్ రేట్లు అందుబాటులోకి రానున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన మొదటిగా దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రేపటి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి జిఎస్టి ఉత్సవ్ ప్రారంభం అవుతుంది. జిఎస్టి మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగింది. దేశమంతా సంతోషపడే జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. జిఎస్టి 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి. కొత్త జిఎస్టి వల్ల ఉత్పత్తిదారులకు, వినియోదారులకు ఇద్దరికీ ప్రయోజనమే. జిఎస్టి సంస్కరణలు ఆత్మ నిర్భర్ భారత్‌కు ఊతమిస్తాయి. జిఎస్టి సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది’’ అని మోడీ అన్నారు.

గతంలో దేశంలో రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవని ప్రధాని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల పన్నులను రద్దు చేసి జిఎస్టిని తీసుకువచ్చామని పేర్కొన్నారు. ‘‘జిఎస్టి సంస్కరణలతో ప్రజల పొదుపు పెరుగుతుంది. ప్రజలను గందరగోళం నుంచి జిఎస్టి బయటపడేసింది. పన్నుల సంస్కరణలతో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగుతోంది. జిఎస్టితో ‘వన్‌ నేషన్-వన్ ట్యాక్స్’ స్వప్నం సాకారమైంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తు రవాణా సులభమవుతోంది. రాష్ట్రాల మధ్య వస్తు రవాణా కూడా ఇకపై చౌకగా మారుంది. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను. జిఎస్టి కొత్త సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ మరింత పరుగులు పెడుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా శాతం జిఎస్టి ఉంటుంది. కొన్ని వస్తువులపై 5 శాతం జిఎస్టి మాత్రమే ఉంటుంది. మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించేందుకే రూ.12 లక్షల వరకూ ఐటి మినహాయింపు ఇచ్చాం.’’ అని మోడీ (PM Modi) అన్నారు.

జిఎస్టి తగ్గింపుతో దుకాణాల యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు అని మోదీ పేర్కొన్నారు. ‘‘నాగరిక్ దేవోభవ.. నినాదంతో మేం ముందుకెళ్తున్నాం. జిఎస్టి తగ్గించడంతో కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతోంది. దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉంది. హోటల్స్ సేవలపై కూడా జిఎస్టి తగ్గించాం. కొత్త సంస్కరణలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తాయి. ఎంఎస్‌ఎంఇలకు అత్యధిక ప్రయోజనం చేకూరేలా మార్పులు చేశాం’’ అని మోడీ (PM Modi) తెలిపారు.

Also Read : వచ్చే నెలలో మోడీ, ట్రంప్ భేటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News