Thursday, May 2, 2024

కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటే: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ఎస్పీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రదాని మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ వర్గీకరణ చేసి తీరుతామని.. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పారు. కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే.. ఓటమి భయంతోనే కేసీఆర్ వేరే చోటికి వెళ్లారని అన్నారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా? అని అన్నారు.

పాలనను గాలికి వదిలేసి ఫామ్‌హౌస్‌లో పడుకునే సిఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? అని ప్రజలనుద్దేశించి అన్నారు. ఇక, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటేనని.. వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.బీజేపీ అధికారంలోకి వస్తే బీసిని సిఎం చేస్తామని చెప్పామని.. మాట నిలబెట్టుకుంటామని అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News