Monday, May 6, 2024

ప్రధానిని కుంభకర్ణునితో పోల్చిన మమత

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తాజాగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలు, ముస్లింలు, దళితులపై అత్యాచారాలు సంభవించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ‘కుంభకర్ణుని’ వలె నిద్ర పోతున్నారని మమత విమర్శించారు. సందేశ్‌ఖాలి సంఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాని నిశితంగా విమర్శించిన మరునాడు మమత ఈ వ్యాఖ్యలు చేశారు. సందేశ్‌ఖాలిలో నిందితునిపై తమ ప్రభుత్వం చర్య తీసుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ‘దేశానికి పతకం సాధించిన సాక్షి (మాలిక్)పై అత్యాచారాలు జరిపిన

నిందితులపై ఏ చర్య తీసుకున్నారో చెప్పండి’ అని మోడీని మమత అడిగారు. ‘మీరు అతనిని ఒక నాయకుని చేశారు. అతనిపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయలేదు’ అని ఆమె ఆరోపించారు. ‘మోడీ బాబు ! బిల్కిస్ హత్య జరిగినప్పుడు మీరు నిద్ర పోతున్నారు. హత్రాస్‌లో ముస్లింలు, దళితులు అవమానాలకు గురైనప్పుడు మీరు కుంభకర్ణునిలా నిద్రిస్తున్నారు. ఎన్‌ఆర్‌సి సమయంలో అస్సాంలో జనం వధ జరిగినప్పుడు మీరు నిద్రిస్తున్నారు’ అని మమత విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News