Friday, April 26, 2024

బాల్య స్నేహితుడి అంతిమయాత్రలో పాల్గొన్న పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:బాల్య స్నేహితుడు, నిజామాబాద్ జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సాలంబిన్ అలీ పార్ధీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, చిన్నానాటి స్నేహితుడు మృతిచెందడంతో చివరి చూపు కోసం శుక్రవారం స్పీకర్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బాన్సువాడకు స్పీకర్ పోచారం తరలివెళ్లారు. రాంపూర్ గ్రామంలోని మజీద్ వద్ద ఉంచిన చిన్ననాటి స్నేహితుడి భౌతిక కాయాన్ని చూసి స్పీకర్ పోచారం కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా సాలంబిన్ కుటుంబ సభ్యులను స్పీకర్ ఓదార్చారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడు సాలంబిన్ అలీ మరణం బాధాకరమన్నారు. సాలంబిన్ మరణవార్త వినగానే దిగ్భ్రాంతికి లోనై దుఃఖానికి గురయ్యాని ఆయన తెలిపారు. సాలంబిన్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడనీ, తనతో ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడేవారని, సాలంబిన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్టు స్పీకర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. మజీద్ వద్ద సాలంబిన్ పాడే (జనాజా) ను మోసిన స్పీకర్ పోచారం అనంతరం రాంపూర్ నుంచి బాన్సువాడ ఈద్గా వద్దకు వచ్చారు. ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం బాన్సువాడ నేక్ బీబీ సాహెబ్ స్మశానవాటికలో ముస్లిం సంప్రదాయాల ప్రకారం జరిగిన ఖననం (తద్ ఫిన్) కార్యక్రమంలో సైతం స్పీకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News