Sunday, April 28, 2024

2026 మార్చికి పోలవరం పూర్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తి గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గురువారం కొత్త గడువును ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు తేదీని మళ్లీ పొడిగించారు. పోలవరం తొలిదశ పనుల పూర్తికి గడువు తేదీని 2026 మార్చికి పొడిగించారు. తొలిదశ పనులల్లో భాగంగా 41.15 మీటర్ల కాంటూర్‌లోనే నీళ్లను డాంలో నింపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో పెండింగ్ ప్రాజెక్ట్‌లపై లోకసభలో వైసిపి ఎంపీ పి. బ్రహ్మానంద రెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వరతుడు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దీంతో 2026 మార్చి నాటికే పోలవరం తొలిదశ పనులు పూర్తవుతాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినట్లైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News