Wednesday, December 4, 2024

క్లాస్‌మేట్‌ను వేధిస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Police have arrested man was harassing classmate

హైదరాబాద్: తన ప్రేమను నిరాకరించిందని కక్ష్య పెంచుకున్న ఓ యువకుడు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తుండా రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని హిమాయత్‌నగర్, కింగ్‌కోఠికి చెందిన ఎండి సమీర్ ఇబ్రహింపట్నంలోని ఓ కాలేజీలో ఎంబిఏ చేస్తున్నాడు. అదే కాలేజీలో బాధితురాలు ఎంబిఏ చదువుతోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో కొద్ది రోజులుగా స్నేహం చేస్తున్నారు. తరచూ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునేవారు, ఛాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆమెకు యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పాడు. దానికి యువతి నిరాకరించింది. అప్పటి నుంచి నిందితుడి ఫోన్‌కు, ఛాటింగ్‌కు స్పందించడం మానివేసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె ఫొటోలను మార్పింగ్ చేసి కాల్ గర్ల్‌గా చెబుతూ సోషల్ మీడియాలో పెట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని బాధితురాలి క్యారెక్టర్‌ను దిగజార్చేలా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైం ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మికాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News