Thursday, May 2, 2024

ఉగ్రదాడికి తీవ్రగాయాల పాలైన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : శ్రీనగర్‌లో గత అక్టోబర్‌లో ఉగ్రవాద కాల్పులకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వని గురువారం తెల్లవారు జామున చనిపోయారు. గత అక్టోబర్ 29న మస్రూర్ అహ్మద్ వని ఈద్గా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా, లష్కర్ ఇ తాయిబా ఉగ్రవాది మూడుసార్లు కాల్పులు జరిపాడు. వనితో క్రికెట్ టీమ్ ఆడుతున్నవారు కాల్పులు జరిపిన దుండగుడిని వెంటాడినా తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయాల పాలైన వనిని హుటాహుటిన మొదట సౌర ఆస్పత్రికి , ఆ తరువాత విమానంలో ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు తరలించారు.

చికిత్స పొందుతూ వని గురువారం చనిపోయారు. ఆయనకు భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయనను బతికిండానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు. హంతకుడు ఉగ్రవాది అయిన బసిత్‌దార్‌గా పోలీస్‌లు గుర్తించారని, దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంకు చెందిన వాడని కుమార్ చెప్పారు. కశ్మీర్ లోయలో లక్షం చేసుకుని హత్యలకు పాల్పడడం కొనసాగుతోందని మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వెలిబుచ్చారు. ఈహత్యకు తామే బాధ్యులుగా పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఇ తొయిబా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News