- Advertisement -
వాగు దాటుతూ నీటిలో కొట్టుకపోతున్న వ్యక్తిని స్థానిక ప్రజలు, భువనగిరి రూరల్ పోలీసులు కాపాడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, అనాజిపురం-బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామాల మధ్యలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం, మాదారం గ్రామానికి చెందిన అలివర్తి పెద్ద మహేష్ అనాజిపురం నుంచి రావిపహాడ్ వెళ్లే దారిలో వాగు వద్ద వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భువనగిరి రూరల్ ఎస్‌ఐ మిర్యాల అనిల్ కుమార్ గ్రామస్థులతో కలిసి జెసిబి సాయంతో ఆ వ్యక్తిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తి బయటకు రావడంతో పోలీసులు, గ్రామస్థులు, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -