Saturday, July 27, 2024

కెప్టెన్‌గా విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

kohli

 

పాంటింగ్ డ్రీమ్ టీమ్ ఎంపిక

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికి పాంటింగ్ ఈ దశాబ్దపు తన అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. ఇందులో కెప్టెన్‌గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని నియమించాడు. తన కలల జట్టులో టీమిండియా తరఫున ఒక్క కోహ్టికి మాత్రమే పాంటింగ్ చోటు కల్పించాడు. కెప్టెన్‌గా కోహ్లి అసాధారణ రీతిలో రాణిస్తున్నందున తన జట్టు సారథిగా అతనై సరైనోడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక, ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)లను ఎంపిక చేశాడు. మరోవైపు వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్‌ను కాదని శ్రీలంక స్టార్ కుమార సంగక్కరను ఎంపిక చేయడం గమనార్హం. సంగక్కరతో పోల్చితే కోహ్లి మెరుగైన వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే పాంటింగ్ మాత్రం సంగక్కరకే తన జట్టులో చోటు కల్పించాడు. అంతేగాక భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా ఆసక్తి చూపలేదు. అతనికి బదులు స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా స్టార్ నాథన్ లియాన్‌కు స్థానం ఇచ్చాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లకు కూడా తన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. ఐదో నంబర్‌లో కోహ్లిని బరిలోకి అవకాశమిచ్చాడు. బౌలింగ్ విభాగంలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్‌లను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్‌గా ఇంగ్లండ్ స్టార్ బెన్‌స్టోక్స్‌కు చోటు దక్కింది.

జట్టు వివరాలు: విరాట్ కోహ్లి (కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, బెన్‌స్టోక్స్, కుమార సంగక్కర, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్, స్టెయిన్, నాథన్ లియాన్.

Ponting declared best Test team of this Decade
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News