Wednesday, May 8, 2024

డబ్బింగ్‌లో ‘అశ్వథ్థామ’

- Advertisement -
- Advertisement -

Nagasourya

 

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘అశ్వథ్థామ’. రమణతేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నాగశౌర్య ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నాడు. ఇటీవల విడులైన సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయట. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరాః మనోజ్ రెడ్డి, మ్యూజిక్‌ః శ్రీచరణ్, ఎడిటర్‌ః గ్యారీ బి.హెచ్.

Nagasourya says of his character dubbing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News