Tuesday, April 23, 2024

భక్తురాలిని కొట్టినందుకు పోప్ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

వాటికన్ సిటీ: 2020 నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ఒక మహిళపై చేయి చేసుకున్నందుకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణ చెప్పారు. మహిళలపై అన్ని రకాల హింసను ఖండిస్తూ ప్రసంగం చేయడానికి వెళుతున్న సందర్భంగా ఒక మహిళా భక్తురాలు పోప్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కరచాలనానికి ప్రయత్నిస్తూ ఆయనను లాగింది. పట్టుతప్పి కింద పడిపోబోయిన పోప్ ఆమె చేతి మీద రెండుసార్లు కొట్టారు. సెయింట్ పీటర్ స్కేర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కొన్ని సందర్భాలలో మనం సహనం కోల్పోతుంటామని, ఇది నాకూ వర్తిస్తుందని పోప్ చెప్పారు. నిన్నటి బాధాకరమైన సంఘటనకు క్షమాపణ చెబుతున్నానని పోప్ పేర్కొన్నారు. కాగా, ఒక మహిళపై పోప్ చేయిచేసుకున్న సంఘటనపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 83 ఏళ్ల పోప్ చాలా కష్టంగా నడుస్తున్న తరుణంలో ఆయన చేయి పట్టుకుని లాగడం మంచి పద్ధతి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా కొందరేమో పోప్ అలా చేసి ఉండవలసింది కాదంటూ వ్యాఖ్యానించారు.

Pope regrets for slapping woman devotee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News